- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సత్యం శ్రీరంగానికే పట్టం..!
దిశ, కూకట్‌పల్లి : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉండనున్నారనే చర్చ మొదలైంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు టికెట్ ఆశిస్తుండగా టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం పేరు ప్రధానంగా వినిపిస్తోంది. విద్యావంతుడు, నిత్యం ప్రజల్లో ఉండి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నాడని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించడంతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా సత్యం శ్రీరంగంకు గుర్తింపు ఉంది. ఈ క్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి సత్యం శ్రీరంగం పేరును పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పేరునే ఖరారు చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు గట్టి పోటీ ఇచ్చే నాయకుడు సత్యం శ్రీరంగం మాత్రమే.. అని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సామాజిక సేవా కార్యక్రమాలతో..
శ్రీరంగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు, సేవా కార్యక్రమాలను చేపడుతూ సత్యం శ్రీరంగం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. తన సంస్థ ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇద్దరు వలంటీర్ ఉపాధ్యాయులు, స్వీపర్లకు నెల జీతాలను అందిస్తూ పేద విద్యార్థుల చదువుకు చేయూతనందిస్తున్నారు. అదే విధంగా వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం చేస్తూ ఆదుకోవడంతో పాటు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో మందికి తమ సంస్థ తరఫున సేవలు అందించి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా సత్యం శ్రీరంగంకు మంచి పేరు ఉంది.
పార్టీ బలోపేతానికి కృషి
కూకట్‌పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా సత్యం శ్రీరంగం కృషి చేస్తున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధిగా వరుసగా మూడుసార్లు ఎన్నికైన ఆయన పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులతో కలిసి పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు. నియోజకవర్గంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రను నిర్వహించి అన్ని డివిజన్ల పార్టీ కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నారు. అదే విధంగా ప్రజల సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకు వెళ్లేందుకు వినూత్న పద్ధతుల్లో కార్యక్రమాలను నిర్వహించడంలో సత్యం శ్రీరంగం స్టైలే వేరు.
బరిలో దిగితే గెలుపు పక్కా..
కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సత్యం శ్రీరంగం పోటీలో ఉంటే పార్టీకి మరింత బలం చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. విద్యావేత్తగా, సోషల్ వర్కర్‌గా గతంలో కార్పొరేటర్‌గా పోటీ చేయడంతో పాటు, ఎలక్షన్ మేనేజ్‌మెంట్ తెలిసిన వ్యక్తిగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేను ఢీకొట్టే నాయకుడిగా సత్యం శ్రీరంగం నిలబడతాడు.. అన్న చర్చ స్థానికంగా జరుగుతోంది. బయటి వ్యక్తులకు టికెట్ కేటాయిస్తే పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి మద్దతు తెలపకపోవడంతో పాటు పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది.. అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సత్యం శ్రీరంగం పోటీలో ఉంటే పార్టీ గెలుపు సునాయాసంగా ఉంటుందని టాక్ నడుస్తోంది. దీనికి తోడు సోనియాగాంధీ విజయభేరి సభతో పార్టీ మరింత పుంజుకోవడంతో కూకట్‌పల్లిలో కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందని పార్టీ నేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.