Breaking: ‘మా’ అధ్యక్షుడు Manchu Vishnu సంచలన నిర్ణయం

by srinivas |   ( Updated:2023-07-31 16:14:01.0  )
Breaking: ‘మా’ అధ్యక్షుడు Manchu Vishnu సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు జరిగి 24 గంటలు గడవక ముందే ‘మా’ అసోసియేషన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ‘మా’ ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆలోపు తానిచ్చిన హామీలన్నీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే మే లేదా జూన్‌లో ‘మా’ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయన పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు.

‘మా’ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు ఆ తర్వాత సమస్యలను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు కొనసాగుతున్నాయి. పైగా ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికల కంటే ఎక్కువ వాతావరణాన్ని తలపించాయి. ఆ ఎన్నికల్లో నటుడు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య పోటీ జరిగింది. దీంతో మెగా ఫ్యామిలీ ప్రకాశ్ రాజ్‌కు మద్దతు పలికింది. మంచు విష్ణు గెలుపు కోసం స్వయంగా మోహన్ బాబు రంగంలోకి దిగారు. దీంతో రెండు వైపుల నుంచి విమర్శలు చేసుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం తామందరం ఒక్కటేనని ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకున్నారు. అయితే ఎన్నికల సందర్బంగా జరిగిన ఘటనల ఎఫెక్ట్ మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇప్పటికీ కొందరు నటులు ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు గెలిచిన విషయం తెలిసిందే. తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికల్లో సి. కల్యాణ్ ప్యానల్‌పై దిల్ రాజు ప్యానల్ విజయం సాధించింది. దీంతో దిల్ రాజు ప్యానల్‌లోని సభ్యులు కీలక పదవులను సొంతం చేసుకున్నారు. అయితే ‘మా’ అసోసియేషన్ ఎన్నికల సమయంలో జరిగినన్నీ విమర్శలు, వివాదాలు టీఎఫ్‌సీసీ అధ్యక్ష ఎన్నికలో జరగలేదు. ప్రశాంతం ఎన్నికలు జరిగాయి. ఫలితాలు విడుదలయ్యాయి. ఇక ఎన్నికల సమయంలో ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు తన వంతు బాధ్యత నిర్వర్తించారు. అయితే తాజాగా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. వచ్చే ‘మా’ ఎన్నికల్లో తాను పోటీ చేయనని మంచు విష్ణు చెప్పడంతో ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చర్చ ప్రారంభమైంది. మంచు విష్ణు ఇంతటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటబ్బా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. చూడాలి మున్ముందు ఏం జరుగుతుందో.

ఇవి కూడా చదవండి

మంత్రి అంబటి రాంబాబుపై మరోసారి నటుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

షారుఖ్ నన్ను మోయలేడు అనుకున్నా.. చాలా స్ట్రాంగ్ అని ఆరోజే తెలిసింది: కాజోల్

Advertisement

Next Story