Women's Commission : మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలపై మహిళా కమిషన్ ఆగ్రహం

by Sridhar Babu |
Womens Commission : మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలపై మహిళా కమిషన్ ఆగ్రహం
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : రాష్ట్రంలో మహిళలపై దాడులు, అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల దినపత్రికలలో బట్టలిప్పి కొడతా అని మహిళా స్పీపర్లకు ఎస్ఎఫ్ఏ వార్నింగ్ పై ఆమె స్పందించారు. ఈ కథనంపై వివరణ ఇచ్చేందుకు సంబంధిత విభాగం అధికారులు స్వయంగా హాజరు కావాలని ఆదేశించారు. అంతేకాకుండా కదులుతున్న బస్ లో రేప్,

హైదరాబాద్ లో మరో రేప్ , దివ్యాంగులరాలిపై లైంగిక దాడి , స్నేహితుడని నమ్మితే రేప్, నమ్మించి లైంగిక దాడి , మహిళపై అఘాయిత్యానికి యత్నం - కేకలు వేయంతో దుండగుడు పరార్, ఖమ్మం లో మళ్లీ అబార్షన్లు, అంగన్ వాడీ టీచర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించడం , మద్యం మత్తులో తల్లిపై లైంగిక దాడి, నాలుగు నెలల గర్భిణీ మృతి, అడ్రస్ చెబితే ఇంటి వద్దకే అమ్మాయి వంటి కథనాలపై స్పందిస్తూ సంబంధిత అధికారులు సత్వరమే సమగ్ర విచారణ జరిపి నివేదికలు సమర్పించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story