- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గత ప్రభుత్వం ముస్లింలకు చేసిందేమి లేదు : షేక్ సత్తార్ సాహెబ్..
దిశ, ఖైరతాబాద్ : ముస్లిం రిజర్వేషన్లు, వారి హక్కుల సాధన, ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి, ఆల్ ఇండియా దళిత ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ ఫోరం ఎప్పటి నుంచో పోరాడుతోందని సమితి అధ్యక్షుడు షేక్ సత్తార్ సాహెబ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి జాతీయ అధ్యక్షుడు షేక్ ఇస్లాముద్దీన్ తో కలిసి ఆయన మాట్లాడుతూ ఈ పదేండ్ల కాలంలోనూ తాము ఎన్నో ప్రజాస్వామిక ఉద్యమాలు చేశామని అన్నారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం ఈ పదేండ్ల కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని తాము ప్రశ్నించామని అన్నారు. గత ప్రభుత్వం మీదకు పది ప్రశ్నలు సంధించామని అన్నారు. ఈ ఎన్నికల్లో వక్స్ బోర్డు భూములు అన్యాక్రాంతం కావడం, సచార్ కమిటీ సూచనలు చేయకపోవడం తదితర అంశాలను ముస్లిం సమాజంలోకి తీసుకెళ్లామన్నారు.
తమ పిలుపునకు ముస్లిం సమాజం స్పందించిందని ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తమ మాటవిని కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించిన ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలియజేశారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని.. హామీలను నెరవేర్చాలని కోరారు. వీటితో పాటు డిప్యూటీ సీఎం పదవితో పాటు నామినేటెడ్ పోస్టుల్లో ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని, గత ప్రభుత్వం హయాంలో మూతపడ్డ ముస్లిం విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించాలని ఆయన నూతనంగా ఏర్పడనున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ షాహీద్ తదితరులు పాల్గొన్నారు.