- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు మెచ్చుకోదగినవి : సీవీ ఆనంద్
దిశ, రాంనగర్ : తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు ,ప్రజాప్రతినిధులు వసతి గృహాలను సందర్శించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశనుసారంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఐపీఎస్ శనివారం ముషీరాబాద్,బాగ్ లింగంపల్లి లోని తెలంగాణ బాలికల మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్న హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలు, కల్పిస్తున్న సదుపాయాలను, విద్య బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇస్తున్న బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ విషయమై ప్రిన్సిపల్స్ తో చర్చించారు. ప్రిన్సిపాల్ వాణిశ్రీ ,డాక్టర్ కె. చల్లా దేవి , డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ శాఖ అధికారులతో పాటుగా పాఠశాలల్లోని కిచెన్, వాష్ రూమ్, సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ ,రోబోటిక్ ల్యాబ్, స్పోర్ట్స్ రూమ్, డార్మిటరీలు ఆయన పరిశీలించారు.
అనంతరం హైదరాబాద్ కమిషనర్ సి వి ఆనంద్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ… ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహార విధానాన్ని తీసుకోవాలని క్రీడల వంటి పాఠ్యేతర కార్యకలాపాలలో కూడా పాల్గొనాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఆరోగ్యకరమైన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది అని తెలిపారు. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు,వస్తువులు విద్య, ఆహారం, క్రీడలు, మౌలిక సదుపాయాలు మెచ్చుకో తగ్గవిగా ఉన్నాయన్నారు.అన్ని సాంఘిక , మైనారిటీ సంక్షేమ హాస్టళ్ల పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు. నీట్ , జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినందుకు విద్యార్థులను అభినందిస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల కృషి వల్లనే విద్యార్థులు గొప్ప విజయాలు సాధిస్తారని, విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం ప్రయత్నించాలి అన్నారు. ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండండి, కష్టపడి చదువుకుని తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కోరికల ఆశయాలకు అనుగుణంగా పట్టుదలతో చదివి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్,సీఐ రాజు నాయక్, గురుకుల పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.