అభివృద్దికి చిరునామా అల్వాల్ అనే విధంగా తీర్చిదిద్దుతాం

by Sridhar Babu |
అభివృద్దికి చిరునామా అల్వాల్ అనే విధంగా తీర్చిదిద్దుతాం
X

దిశ, అల్వాల్ : అభివృద్ది పనులలో ఎలాంటి నాణ్యతా లోపాలు జరుగకుండా నిర్మించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం అల్వాల్ సర్కిల్ రాజీవ్ నగర్ లో రూ.31 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ సబిత అనిల్ కిశోర్ గౌడ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్వాల్, మల్కాజిగిరిల జంట సర్కిళ్ల అభివృద్దికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని తెలిపారు. అభివృద్ది విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతంగా వ్యహరిస్తూ తనవాళ్లు అనుకునేవారికి అదనపు వడ్డింపులు చేస్తుందన్నారు.

ఇప్పటికే మల్కాజిగిరి నియోజకవర్గంలో అభివృద్ది పనుల విషయంలో జాప్యం జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమం అభివృద్ది విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిలబడి అభివృద్ధి పథంలో మల్కాజిగిరి నియోజకవర్గాన్ని ముందుంచుతానని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే బర్త్ డే సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ సబిత అనిల్ కిశోర్ గౌడ్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ మోసిన్, ఫ్యయాజ్, షరీఫ్, తాజుద్దిన్, ఫరీద్, సురేష్, జేడి నర్సింగ్, జమెదార్,రాజేష్, రాము, సురేష్ రెడ్డి, సోమయ్య, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed