ఇన్‌చార్జి వ్యవస్థలు వద్దు: TTGDA తీర్మానం

by srinivas |
ఇన్‌చార్జి వ్యవస్థలు వద్దు: TTGDA తీర్మానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో ఇన్‌చార్జి వ్యవస్థలను అమలు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం పేర్కొంది. ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. మీటింగ్‌లో అన్ని జిల్లాల నుంచి డాక్టర్లు పాల్గొన్నారు. ఫేరిఫెరల్ మెడికల్ కాలేజీ అలవెన్స్ త్వరగా అమలు చేయాలని తీర్మానించారు. అడిషనల్ డీఎంఈలను రెగ్యులర్ పద్ధతిలో నియమించాలని పొందుపరిచారు. బదిలీలపై ఒక పాలసీ తీసుకువచ్చి రెగులర్‌గా చేయాలన్నారు. శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్లను త్వరగా నియమించాలని, పాత కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్ధితిన కాకుండా, ఫెరిఫెరిలో పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానించారు. పోస్టులను రోగుల రుద్ది ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. ‘సీనియర్ రెసిడెంట్లను త్వరగా నియమించాలి. మెడికల్ కాలేజీలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక జాబ్ చార్ట్ రూపొందించాలి. పని గంటలపై స్పష్టత ఇవ్వాలి. ఆసుపత్రుల అడ్మినిస్టేటర్స్ వైద్య యూనియన్ నాయకులను టార్గెట్ చేయకూడదు. యూనియన్ సమావేశాలు రెగ్యులర్‌గా నిర్వహించాలి.’ అని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్​మాదాల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed