- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెచ్ సీయూ వార్డెన్ పై విద్యార్థులు దాడికి యత్నం
దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ శనివారం ఉదయం రణరంగంగా మారింది. విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ.. ఫైన్ ల పేరిట వేలకు వేల జరిమానాలు విధిస్తున్న హాస్టల్ వార్డెన్ సువశిశ రాణాపై అన్ని విద్యార్థి సంఘాలు ఎదురు దాడికి దిగాయి. శనివారం మరోసారి హాస్టల్ గదులను చెక్ చేసేందుకు వచ్చిన హాస్టల్ వార్డెన్ సువశిశ రాణాను అడ్డుకున్నారు. క్రమశిక్షణ పేరిట వేలకు వేలు జరిమానాలు విధిస్తూ విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఆయన శనివారం మరోసారి హాస్టళ్ల తనిఖీ కోసం రాగా అందరూ కలిసి మూకుమ్మడిగా కలిసి దాడికి యత్నించారు. దీంతో ఆయన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి అక్కడి నుంచి పరుగులు తీశాడు.
అయినా విద్యార్థులు ఆయన వెంటపడి అక్కడి నుండి తరిమికొట్టాయి. వార్డెన్ సువశిశ రాణా కళ్లు తిరిగి పడిపోయాడు. ఆయనను సెక్యూరిటీ సిబ్బంది మోసుకువెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ కూడా విద్యార్థులు ఆందోళనకు దిగి, సెక్యూరిటీ సిబ్బందిపై విద్యార్థులు దాడికి దిగారు. విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు హెచ్ సీయూకు చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకు వచ్చారు. గత కొద్దిరోజులుగా విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న హాస్టల్ వార్డెన్ సువశిశ రాణాను విధుల నుంచి బహిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హెచ్ సీయూలో విద్యార్థుల పట్ల హాస్టల్ వార్డెన్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.