కోఠి మహిళా కళాశాలలో విద్యార్థుల ఆందోళన..

by Kalyani |
కోఠి మహిళా కళాశాలలో విద్యార్థుల ఆందోళన..
X

దిశ,కార్వాన్ : కోటి మహిళా కళాశాలలో విద్యార్దినీలు ఆందోళనకు దిగారు. తమను వెంటనే యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం విశ్వవిద్యాలంగా నామకరణం చేసిందని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని ఆరోపించారు. అంతే కాకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు మార్చిందన్నారు. తమ డిగ్రీ పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇంతవరకు యూజీసీ లో చేర్చకపోవడం వల్ల తమకు ఏ ప్రాతిపదికన సర్టిఫికెట్ ఇస్తారని, తమ భవిష్యత్తు అయోమయంగా మారిందని విద్యార్ధినీలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని, తమను వెంటనే యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ వందల సంఖ్యలో విద్యార్థినీలు కాలేజీ ప్రాంగణంలో బైఠాయించి కాలేజీ గేటును ఓపెన్ చేయాలంటూ నినాదాలు చేశారు.

Advertisement

Next Story