- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మెడికల్ కాలేజీల పర్మిషన్లపై ఉత్కంఠ
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త మెడికల్‌కాలేజీల పర్మిషన్లపై ప్రభుత్వం ఎంతో ఉత్కంఠతో ఉంది. ఈ అకాడమిక్ఇయర్లోనే మరో 9 కాలేజీలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఈ కాలేజీలకు అతి త్వరలో ఫైనల్ ఆడిట్ ఉంది. దీంతో నేషనల్ మెడికల్కమిషన్అనుమతి ఇస్తుందా? లేదా? అని సర్కార్‌తోపాటు వైద్యాధికారులూ టెన్షన్‌పడుతున్నారు. ఇప్పటికే కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, భూపాలపల్లి జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలను నేషనల్ మెడికల్ కమిషన్ బృందాలు రెండు సార్లు తనిఖీ చేశాయి. కాలేజీ బిల్డింగ్, హాస్పిటల్స్ ఉన్న సౌకర్యాలు, స్టాఫ్ ఇతర అంశాలను పరిశీలించాయి. అయితే ఫస్ట్‌టైమ్ విజిట్ లోని లోపాలను రెండో విజిట్ లోనూ ప్రభుత్వం సవరించలేకపోయింది. దీంతో గతంలో ఎన్ఎంసీ కొత్త మెడికల్కాలేజీలపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇక రెండోసారి తనిఖీల్లోనూ మరిన్ని లోపాలను గుర్తించి వెంటనే మార్పులు చేయాలని ఎన్ఎంసీ వైద్యశాఖకు ఆదేశాలిచ్చింది. దీంతో ఫైనల్ఆడిట్ లోపు కనీసం ఒక్క లోపం కూడా ఉండకూడదనేది రూల్. అయితే ఒకవేళ మళ్లీ లోపాలు గుర్తిస్తే ఎన్ఎంసీ పర్మిషన్ఇచ్చే ఛాన్స్తక్కువే. దీంతో ప్రభుత్వంతోపాటు అధికారుల్లోనూ కాస్త ఆందోళన నెలకొన్నది.
ఎన్ఎంసీ గుర్తించిన సమస్యలు....
ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ ఫాకల్టీ కొరత, హాస్పిటల్‌లో రూల్స్ ప్రకారం ఉండాల్సిన వసతులు లేవని గతంలో ఎన్ఎంసీ పేర్కొన్నది. ఫైనల్ ఆడిట్‌కు వచ్చేవరకూ ఇప్పుడు గుర్తించిన లోపాలు అన్నింటినీ సరిచేసుకోవాలని గతంలో ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఎన్ఎంసీ అధికారులు సూచించారు. అయితే ఆయా కాలేజీల్లో ప్రధానంగా ప్రొఫెసర్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నదని స్వయంగా వైద్యాధికారులే టెన్షన్‌పడుతున్నారు. దీంతో పక్క రాష్ట్రాల నుంచి ప్రొఫెసర్లను తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. ఒకవేళరూల్స్ప్రకారం అన్ని సౌకర్యాలు కలిగి ఎన్ఎంసీ పర్మిషన్లు ఇస్తే జులై ఆగస్టు నుంచే కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, భూపాలపల్లితోపాటు ఆసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్ లోనూ కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ఉన్నది. ఇక ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు అప్రూవల్అయితే రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26 కు చేరనున్నది. దీంతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 3,690 కి పెరగనున్నది. అయితే స్వరాష్ట్రం ఏర్పడక ముందు 5 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు 26 కు పెరగడం విశేషం. జిల్లాకో మెడికల్‌కాలేజీ ఏర్పాటు చేయాలనేది సర్కార్ లక్ష్యం.