భార్య మిస్ అయిందని పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

by Kalyani |
భార్య మిస్ అయిందని పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
X

దిశ, కాచిగూడ : చప్పల్ బజార్ లో ఫ్యామిలీ ఫంక్షన్కు వెళ్ళొస్తానని శుక్రవారం వెళ్లిన తన భార్య రవళి అక్కడికి చేరుకుపోవడంతో, భర్త ఏం సాయి వికాస్ శనివారం కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడు ఎం. సాయి వికాస్ తెలిపిన సమాచారం ప్రకారం… తన నివాసం దారుషిఫా నుండి చప్పల్ బజార్ లో నివసిస్తున్న తన తల్లి దగ్గరికి వెళ్లి, అక్కడే జరుగుతున్న ఫ్యామిలీ ఫంక్షన్ చూసుకుని వస్తానని తన ఇంటి నుండి రాపిడో బైక్ బుక్ చేసుకుని బయలుదేరిందని తెలిపారు. అక్కడ వెళ్ళినాక ఫోన్ చేయకపోవడంతో, రాపిడో డ్రైవర్ ను సంప్రదించగా గమ్యస్థానానికి 100 మీటర్ల దూరంలో దిగిపోయిందని తెలిపాడని, తన అత్తగారిని సంప్రదించగా, రవళి ఇంటికి చేరుకోలేదని తెలపడంతో, పరిసర ప్రాంతాల్లో ఎక్కడ వెతికిన కనిపించలేదని కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ ఎస్‌ఐ పి రవి కుమార్‌ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed