- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy : తెలంగాణ ఉద్యమంలో టీడీఎఫ్‌ది కీలక పాత్ర : సీఎం రేవంత్ రెడ్డి
దిశ, హిమాయత్ నగర్ : తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్ ) కీలక పాత్ర పోషించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టీడీఫ్ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకల లోగోను తాజ్ డెక్కన్ హోటల్ లో బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాదు. తెలంగాణకు అవసరమైన ప్రతీసారీ అన్ని రంగాల్లో అండగా టీడీఎఫ్ నిలుస్తుందన్నారు. వ్యవసాయంలో ఆధునిక మెలకువలను మన రైతాంగానికి చేరవేయడంతో పాటు ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం హెల్త్ క్యాంపులు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, న్యాయ సేవలు, రూరల్ డెవలప్మెంట్, మహిళా సాధికారత, విద్య, వైద్య తదితర రంగాల్లో తెలంగాణ సమగ్ర వికాసానికి కృషి చేస్తుందని కొనియాడారు.
నూతన ప్రభుత్వానికి అన్ని విషయాల్లో తోడ్పాటు అందిస్తామని, టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా సన్నాహాలు మొదలు పెట్టామని టీడీఎఫ్ నాయకులు తెలిపారు. లోగో ఆవిష్కరించిన కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ టి. రామ్మోహన్ రెడ్డి, టీడీఎఫ్ యూఎస్ఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మణికొండ, ఎలెక్ట్ ప్రెసిడెంట్ భరత్ నరవెట్లా, ప్రతినిధులు శ్రీని గిలిపల్లి, శ్రవంత్ పోరెడ్డి, శ్రీనాథ్ ముస్కుల, మహేంద్ర గూడూర్, కీర్తి గున్న, టీడీఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ డిపి రెడ్డి, టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్టా రాజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.