- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పెషల్ బ్రాంచ్‌లో ‘రీ ఎంట్రీ’
దిశ, సిటీక్రైం : రీ ఎంట్రీ ఇది ఆటలోని మాట కాదు పోలీస్ విభాగంలోని స్పెషల్ బ్రాంచ్‌లో కొంత మంది ఉద్యోగుల విధుల పై తలెత్తిన వివాదం. ఈ విధంగా పలుకుబడితో స్పెషల్ బ్రాంచ్‌లోనే తిష్టవేసి కూర్చున్న కొంత సిబ్బంది తీరుతో మిగతా పోలీస్ అధికారుల అసంతృప్తి ఇది. ఈ విధంగా పోలీస్ వర్గాల్లో ఇప్పుడు స్పెషల్ బ్రాంచ్‌లో రీ ఎంట్రీ హాట్ టాపిక్ అయ్యింది.
ఆరోపణలు ఎదుర్కొన్నా అక్కడే పోస్టింగ్..
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న వారిలో కొంత మంది దాదాపు 6 సంవత్సరాలకు పైగా వివిధ హోదాల్లో తిష్టవేసుకుని ఉన్నారు. ఇందులో కొంత మంది పై ఆరోపణలు రావడంతో చర్యలకు గురై కొన్ని రోజుల పాటు ఈ విభాగం నుంచి బయటికి వెళ్లినా తిరిగి ఈ బ్రాంచ్‌లోకి చేరి విధులు నిర్వహిస్తున్నారని రాచకొండ పోలీస్ వర్గాల్లోనే విమర్శలు ఉన్నాయి. రీ ఎంట్రీ ఇచ్చి, సంవత్సరాల నుంచి ఈ విభాగంలోనే పనిచేస్తున్న వారు 40 నుంచి 60 శాతం వరకు ఉంటారని తోటి పోలీసులే ఆరోపిస్తున్నారు.
మిస్సింగ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద ఫోకస్..
స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేసే ఆఫీసర్స్, సిబ్బంది పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనిచేసే తీరు నుంచి స్థానికంగా ఉన్న పరిస్థితులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు, రాజకీయకంగా చోటుచేసుకుంటున్న మార్పులు ఇంకా పోలీస్ విభాగానికి ఉపయోగపడే కీలక సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తుంటారు. అదే విధంగా పాసుపోర్టు, మిస్సింగ్ డాకుమెంట్స్, జాబ్ వెరిఫికేషన్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తదితర విషయాలకు సంబంధించిన ఎంక్వయిరీ చేసి నివేదికను పీఎస్ అధికారులకు ఇస్తారు.
ఈ ఎస్బీ నివేదిక ఆధారంగా సర్టిఫికెట్లను జారీ చేస్తారు. అయ్యితే ఇలా ఎస్బిలో దీర్ఘాకాలంగా కొంత మంది తిష్టవేయడంతో వారు ఈ ఎంక్వయిరీలో అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ల్యాండ్ మిస్సింగ్ డాకుమెంట్స్లలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఎక్కువ శ్రద్ద చూపిస్తారానే విమర్శలతో పాటు వీటి నివేదికకు లక్షల్లో డబ్బులు చెలించేందుకు దరఖాస్తుదారులు సిద్ధంగా ఉండడంతో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఇలాంటి విచారణల పై ఎక్కువ ఫోకస్ పెడతారని పోలీస్ వర్గాల్లోనే చర్చ ఉంది. దీనికి ఈ విభాగంలో సుధీర్ఘంగా కొంత మంది పనిచేస్తుండడమే ప్రధాన కారణం అని తెలిసింది. దీంతో కొత్త వారికి పనిచేసేందుకు స్పెషల్ బ్రాంచ్‌లో అవకాశం ఇవ్వాలనే వాయిస్ పోలీస్ వర్గాల్లో పెరుగుతుంది.