నియోజకవర్గం అభివృద్ధికి పెద్దపీట : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

by Sridhar Babu |
నియోజకవర్గం అభివృద్ధికి పెద్దపీట : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
X

దిశ, చైతన్య పురి : దశాబ్దాల కాలంగా నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో దశల వారీగా పరిష్కరిస్తున్నానని ఎల్ బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం కొత్తపేట డివిజన్లో గల స్నేహపురి కాలనీ, న్యూ నాగోల్, శివమ్మ నగర్, శ్రీ శంకర్ కాలనీ, కొత్తపేట విలేజ్, న్యూ సమితపురి కాలనీలలో రూ. 2.57 కోట్లతో సీసీ రోడ్లు, యుజిడి పైప్ లైన్, కమ్యూనిటీ హాల్ నిర్మాణాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.

పనిచేసే వారిని ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్, మాజీ కార్పొరేటర్ లు వజీర్ ప్రకాష్ గౌడ్, సాగర్ రెడ్డి, ఏఈ మాతృ నాయక్, నాయకులు లింగాల రాహుల్ గౌడ్, ఎండీ. యాసిన్, విజయ గౌడ్, ఆనంతుల రాజారెడ్డి, మల్లెపాక యాదగిరి, బట్టు ఆంజనేయులు, జోగు నాగేష్, మంచి రాజేష్, సుందర్ నారాయణ, అశ్విన్ సింగ్, రమేష్ చారి, రామకృష్ణ, రాకేష్ యాదవ్, కొత్త తిరుమల, గట్టు మహేష్, కాలనీల అధ్యక్షులు, ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Next Story