దిశ కథనానికి స్పందించిన అధికారులు

by Kalyani |
దిశ కథనానికి స్పందించిన అధికారులు
X

దిశ, బహదూర్ పురా: పురాణాపూల్ స్మశాన వాటిక బస్టాప్ వద్ద నిత్యం ఏర్పడుతున్న ట్రాఫిక్ రద్దీకి గల కారణాలను బుధవారం చార్మినార్ ట్రాఫిక్ ఏసీపీ కె. శ్రీనివాసరావు విశ్లేషించారు. ఈ నెల 20వ తేదీన 'పాడెలకు, ప్రయాణికులకు ఒక్కటే బస్టాప్' అనే కథనం దిశలో ప్రచురితమైన విషయం విధితమే. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. రోడ్డు పక్కనే ఉన్న మట్టి, చెత్తకుప్పల మూలంగా రహదారి కుదించుకుపోయిందని అన్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి మట్టిని తొలగించి సీసీ రోడ్డును వేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story