- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీలోఫర్ ఆసుపత్రి రోగులకు తప్పని తిప్పలు..
దిశ, కార్వాన్ : రోడ్డు మరమ్మతుల పనులకోసం రోడ్డును తవ్వేసి, పనులు ఆలస్యంతో అవస్థలు పడుతున్నారు రోగులు. నిలోఫర్ ఆసుపత్రికి వచ్చిన రోగులు కష్టాలు వర్ణనాతీతం. నీలోఫర్ ఆస్పత్రి వద్ద నుంచి నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చౌరస్తా వరకు సుమారు 22 రోజుల క్రితం రోడ్డు వేసేందుకు రోడ్డును జీహెచ్ఎంసీ అధికారులు తవ్వి మర్చిపోయారు. దీంతో ఆసుపత్రికి వచ్చిన చిన్నపిల్లలతో పాటు గర్భిణీలకు ఇబ్బందికరంగా మారింది. అంతేకాకుండా జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు మండిపడ్డారు. నీలోఫర్ కు వచ్చే అవుట్ పేషెంట్ రోగులు హాస్పిటల్ కు రావాలంటేనే జంకుతున్నారు.
అంతేకాకుండా నడవడానికి వీలు లేకుండా పెద్ద పెద్ద గుంతలు రోడ్డును తవ్వడంతో ఇబ్బందులు రెట్టింపు అయ్యాయి. కనీసం నడవలేని గర్భిణీలు వీల్ చైర్ లో తీసుకువెళ్దాం అన్నా కూడా వీల్ చైర్ నడవలేని పరిస్థితి నెలకొంది. దీంతో అటు గర్భిణీల బంధువులతో పాటు ఇటు ఆసుపత్రికి వచ్చిన చిన్నారుల బంధువులు పలుఇబ్బందులకు గురవుతున్నారు. కొందరైతే హాస్పిటల్లో వైద్యం చేయించుకోకుండానే తిరిగి ఇంటికి వెళుతున్నట్లు రోగుల బంధువులు ఆరోపించారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కు ఫోన్ చేస్తే రిసీవ్ చేయడం లేదని నీలోఫర్ ఆసుపత్రి ఆర్ఎంఓ తెలిపారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని వెంటనే ఆసుపత్రి ముందు యుద్ధ ప్రతిపాదికన తవ్విన రోడ్డును మరమ్మతులు చేయాలని ఆసుపత్రికి వచ్చిన రోగుల బంధువులతో పాటు వైద్యులు జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు.