- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్
దిశ, చార్మినార్ : రాజీ మార్గమే రాజ మార్గమని మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, సివిల్, ఇతర కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ డిసెంబర్ 14న నిర్వహిస్తున్నామని సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్ పర్సన్ రేణుక యార అన్నారు. శనివారం సిటీ సివిల్ కోర్టు లోని తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో చీఫ్ జడ్జి పాల్గొని, మాట్లాడారు. డిసెంబర్ 14 న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ప్రతి కక్షిదారుడు లోక్ ఆదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం మార్చి, జూన్ అలాగే సెప్టెంబర్ మసాలలో యాక్సిడెంట్, సివిల్ కేసులు అలాగే ఇతర కేసులు 1643 పరిష్కరించి సంబంధిత కక్షిదారులకు వంద కోట్లకు పైగా నష్ట పరిహారం అందించడం జరిగిందని అన్నారు.
అదేవిధంగా బ్యాంక్ కేసులు 8207 కు గాను రూ. 21 కోట్ల 47 లక్షలకు పైగా కక్షిదారులకు లబ్ధిచేకూర్చామని అన్నారు. వివిధ ప్రమాదాల్లో చనిపోయిన వారి కేసులు సత్వరమే పరిష్కారం అవుతుండగా అలాగే ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉస్మానియా ఆర్థో విభాగంలో ఉస్మానియా ఆసుపత్రి పర్యవేక్షకులు రాకేష్ సహాయం తో డిసెంబర్ 2,3, 9,10 తేదీల్లో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి అంగవైకల్యం ఉన్న వారి అర్హత మేరకు ధ్రువీకరణ పత్రాలు జారీ తో తదుపరి కక్షిదారులకు నష్ట పరిహారం ద్వారా సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి సత్వరమే లబ్ధి చేకూరుతుందని తెలిపారు. యాక్సిడెంట్ కేసుల కై మెడికల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన పర్యవేక్షకులు, ఇతర ఉన్నతాధికారులకు జడ్జి అభినందించారు. రాజీ మార్గం ద్వారా తమ కేసులను కక్షిదారులు పరిష్కారం చేసుకోవాలని జడ్జి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.