మా నాన్న ఆ తప్పు చేయడం వల్లే ఇలా అయింది : మంచు విష్ణు

by Aamani |   ( Updated:2024-12-11 09:23:06.0  )
మా నాన్న ఆ తప్పు చేయడం వల్లే ఇలా అయింది : మంచు విష్ణు
X

దిశ, శేరిలింగంపల్లి : తమ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదని, ప్రతి ఇంట్లోనూ సమస్యలు ఉంటాయని సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. పిల్లలను ఎక్కువగా ప్రేమించడమే మా నాన్న చేసిన పెద్ద తప్పని అన్నారు. జల్ పల్లిలోని తమ ఫామ్ హౌస్ వద్ద జరిగిన సంఘటనలు, జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటనలపై మంచు విష్ణు స్పందిస్తూ.. తన తండ్రి మోహన్ బాబుకు మీడియా అంటే గౌరవం ఉందని, నిన్నటి ఘటన చాలా బాధాకరమన్నారు. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది, సమస్యలు ఉంటాయి. సినీ ఫ్యామిలీ అని చెప్పి ఇలా చేయడం సరికాదన్నారు. తన తల్లికి ఆరోగ్యం బాగా లేదని, నేను సినిమా షూటింగ్ లో ఉండగా వివాదం జరిగిందని తెలిసి వచ్చాను.. తాను ఇక్కడ ఉంటే ఇంతవరకు వచ్చేది కాదని విష్ణు అన్నారు.

నిన్న జరిగిన ఘటనలో ఓ రిపోర్టర్ కు గాయాలు కావడం విచారకరం. వారు గేటు తోసుకుని లోపలికి చొచ్చుకొని రావడం జరిగింది, రిపోర్టర్ పై దాడి ఆవేశంలో జరిగిందే తప్ప ఎలాంటి ఉద్దేశాలు లేవని తెలిపారు. పోలీసులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ముందుగా మీడియాకు సమాచారం ఇస్తున్నారు. బుధవారం ఉదయం నోటీసు ఇచ్చారన్న ఆయన సమయం తీసుకుని రాచకొండ కమిషనర్ ను కలుస్తామని అన్నారు. లా ప్రకారం నేను కలవాల్సిన అవసరం లేదు. కానీ పోలీసులంటే గౌరవం ఉంది కాబట్టే కలుస్తానని తెలిపారు. ప్రేమతో సమస్యను పరిష్కరించుకోవాలని, రచ్చకెక్కడం కరెక్ట్ కాదని హితవు పలికారు.

మా నాన్నకు సంబంధించిన ఆస్తులపై ఆయనకే హక్కులు ఉంటాయి. తండ్రి ఇంట్లో ఉండటానికి ఇష్టం లేదన్నప్పుడు.. ఎవరైనా బయటకు వెళ్లాల్సిందే.. తల్లిదండ్రులను గౌరవించాలి..హద్దు మీరుతున్న వారు కొంతమంది ఉన్నారు ఇది కరెక్ట్ కాదన్నారు. కొడుకుగా తల్లితండ్రిని మంచిగా చూసుకోవడమే నా ముందు ఉన్న లక్ష్యమని విష్ణు అన్నారు. వినయ్ అనే వ్యక్తి నాకు అన్న లాంటి వారు, 15 సంవత్సరాలుగా వినయ్ తో కలిసి మోహన్ బాబు యూనివర్సిటీని విలువలతో నడుపుతున్నాం, యూనివర్సిటీ తమకు దేవాలయంతో సమానమన్నారు. మా ఇంటి వివాదంలో తలదూర్చిన బయటి వ్యక్తులు దూరంగా ఉంటే మంచిది, సాయంత్రం వరకు టైం ఇస్తున్నానని మంచు విష్ణు హెచ్చరించారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, తొందరలోనే అన్ని సర్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story