నీరు నిలవకుండా చూడండి.. వాన సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ ఆదేశాలు

by Mahesh |   ( Updated:2023-07-19 08:32:37.0  )
నీరు నిలవకుండా చూడండి.. వాన సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ ఆదేశాలు
X

దిశ సిటీ బ్యూరో: హైదరాబాద్ నగరానికి మరో నాలుగు రోజుల పాటు ఐఎండి భారీ వర్ష సూచన చేయడంతో మున్సిపల్ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాలగ్రామ్ గూడా‌లోని గ్రోత్ కారిడార్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ జలమండలి ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాలాల విస్తరణ పూడికతీత పనులతో పాటు ఎస్సై డివి పనులపై మంత్రి ఆరా తీశారు. వరదలు వచ్చినా తట్టుకునేలా ప్రాణ నష్టం జరగకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జోనల్ కమిషనర్లు, సైనిటేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed