- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అన్ని వర్గాలకు సమన్యాయం చేసే వ్యక్తి కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత
దిశ, బేగంపేట: కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా అన్ని వర్గాలను సమన్యాయంగా చూసే గొప్ప మనసున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బుధవారం ఎస్పీ రోడ్డులోని వెస్లీ కళాశాల మైదానంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనంతో పాటు ముందస్తుగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు, సంఘాల సహకారంతో కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని అందుకే అందరిని ఆయన సమానంగా చూస్తారని చెప్పారు. గతంలో తెలంగాణ కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అలాగే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని ఇళ్లు చక్కపెట్టుకున్నామని, ఇప్పుడు దేశాన్ని చక్కపెట్టే పనిలో బీఆర్ఎస్ తో కలిసి అందరూ ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.
దళిత క్రైస్తవు నాయకులకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించి పదవులు అప్పగించారని, మిగతా వారికి కూడా పదవులు వస్తాయని రాజకీయాల్లో ఓర్పు ఎంతో అవసరమని ఆమె సూచించారు. ఈ సందర్భంగా దళిత క్రైస్తవులను ఏకం చేసినా రాజీవ్ సాగర్ ను ఆమె అభినందించారు. అంబేద్కర్ మనుమడు డాక్టర్ రాజారత్నం అంబేద్కర్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులు ఐకమత్యంతో ముందుకు వెళితేనే రాజ్యాధికారం సాధిస్తామని ఎవరికి వారు పోరాటాలు చేసుకుంటూ పోతే ఎప్పటికీ విజయం సాధించలేరని అన్నారు. రాజ్యాధికారం అనే మాస్టర్ కీ చేతిలో ఉన్నపుడు ఏదైనా సాధ్యమవుతుందని అంబేద్కర్, కాన్షీరాంలు సూచించారని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు.
దళితులను అనేక ఏళ్లుగా అంటరానివారిగా పరిగణిస్తూ దేవాలయాల్లోకి కూడా రానివ్వకపోవడంతో క్రైస్తవ మిషనరీలు వారిని అక్కున చేర్చుకున్నారని అందుకే వారు మతం మారారని టీఎస్ ఎంఐడీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. దళితులతో పాటు దళిత క్రైస్తవులకు అన్ని సమాన హక్కులను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐ సినార్డ్ మోడరేటర్ ధర్మరాజు, మెదక్ డయాసిస్ బిషప్ పద్మారావు, వివిధ రాష్ట్రాల నుంచి బిషప్లు ఫ్రాన్సిస్, రెవరెండ్ డాక్టర్ చంద్రశేఖర్, హేమంత్ కుమార్, ముల్కల భాస్కర్, నాయకులు ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గజ్జల నాగేష్, రాయిడన్ రోచ్, విల్సన్ సింగం, శంకర్ లూక్, మేరీ మాదిగ తదితరులు పాల్గొన్నారు.