- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మహిళల అభివృద్ధికి ప్రభుత్వ తోడ్పాటు

దిశ, రవీంద్రభారతి : తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి తోడ్పాటును అందిస్తుందని తెలంగాణ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఉగాది పురస్కారాలను రవీంద్రభారతిలో సోమవారం ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పలు పథకాలు తీసుకు వచ్చినట్లు గుర్తు చేశారు. అంతకుముందు చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పలువురు మహిళలకు శ్రీ విశ్వావసు వారి పురస్కారాలు బాలలకు ఉగాది పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో కూచిపూడి నృత్య గురువు డా. వై.చలపతి శాస్త్రి, మము సైతం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు స్వప్న శ్రీనివాస్, న్యాయవాది రాధిక, భారత ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ లలిత రమణరావు తదితరులు పాల్గొన్నారు.