- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమీర్పేటలోని తినుబండారాల దుకాణాల్లో ఆహార భద్రత సిబ్బంది తనిఖీలు...
దిశ, ఖైరతాబాద్ : హైదరాబాద్ నగరంలో ఆహార భద్రత అధికారులు నిత్యం తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమీర్పేట ప్రాంతంలోని తినుబండారాల దుకాణాల్లో ఆహార భద్రత సిబ్బంది తనిఖీ చేశారు. ఆహార భద్రత ఉల్లంఘనలను గుర్తించినట్లు తెలిపారు. వాసిరెడ్డి ఫుడ్స్, వినూత్న ఫుడ్స్, ఢిల్లీ మిఠాయి వాలా, ఆగ్రా స్వీట్ షాప్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని అధికారులు తెలిపారు. కిచెన్ లో ఉండి పని చేసే ఫుడ్ హ్యాండర్లు, ఇతర సిబ్బంది ఎలాంటి గ్లౌజులు లేదా ఆప్రాన్‌లు ధరించలేదని అధికారులు తెలిపారు. చక్కెర సంచులు నేరుగా నేలపై నిల్వ చేయబడ్డాయని, దుకాణంలో విక్రయించే కొన్ని వస్తువులకు (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయిన రెన్యువల్ చేయించుకోలేదని అన్నారు. కిచెన్ లు అపరిశుభ్రంగా ఉన్నాయని వెల్లడించారు. అక్కడ ఉండే డస్ట్ బిన్ లపై ఎలాంటి మూతలు లేకుండా తెరిచి ఉంచినట్లు గుర్తించారు.