- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదుసార్లు ఎమ్మెల్యే... అయినా ఆటోలో ప్రయాణం
దిశ, బిచ్కుంద: ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. తరాలకు సరిపడా సంపాదించుకునే నేతలు ఉన్న ఈ రోజుల్లో... జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారం తన సాదాసీదా వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకున్నారు. గెలిచినా.. ఓడిన పార్టీ అభివృద్ధి కోసం, జనాల సంక్షేమం కోసం కృషి చేస్తారని ఆయనకు నియోజకవర్గంలో పేరుంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధిని.. జనం ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. బుధవారం పార్టీ కార్యక్రమం నిమిత్తం గాంధీ భవన్‌కు వచ్చిన ఆయన.. ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు ఆటోలో ప్రయాణించారు.
గాంధీభవన్ వద్ద గంగారంను చూసిన.. జుక్కల్ నియోజకవర్గానికి చెందిన ఆటో డ్రైవర్ ఇమామ్, తమ మాజీ ఎమ్మెల్యేను అభిమానంతో పలకరించారు. ఇమ్రాన్ యోగక్షేమాలను అడిగిన గంగారం.. ఇక్కడ ఏం చేస్తున్నావని వివరాలు కనుక్కున్నారు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ.. జీవనం సాగిస్తున్నానని... షేక్ ఇమామ్ తెలిపారు. తమ గ్రామంలో గంగారం చేసిన అభివృద్ధి పనుల్ని, సేవా కార్యక్రమాల్ని షేక్ ఇమామ్ గుర్తు చేశారు. ఇమామ్ అభిమానానికి ముగ్ధుడైన గంగారం.. "చలో నీ ఆటోలోనే వెళ్దాం పదా" అంటూ... ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు ప్రయాణించారు. తన నియోజకవర్గానికి చెందిన ఆటో డ్రైవర్‌తో.. గంగారం ఆత్మీయంగా మాట్లాడిన తీరును చూసి, అక్కడ ఉన్న నేతలంతా లీడర్ అంటే ఇలా సాదాసీదాగా ఉండాలని ప్రశంసలు కురిపించారు.