అభిమానుల అత్యుత్సాహం.. కాలిపోయిన జూనియర్ ఎన్టీఆర్ కటౌట్

by Aamani |
అభిమానుల అత్యుత్సాహం..  కాలిపోయిన జూనియర్ ఎన్టీఆర్ కటౌట్
X

దిశ, ముషీరాబాద్: దేవర సినిమా విడుదలైన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సుదర్శన్ థియేటర్ లో బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో బాణాసంచా నుంచి వెలుబడిన నిప్పు రవ్వలు ఎగిరి జూనియర్ ఎన్టీఆర్ కటౌట్‌పై పడ్డాయి. వెంటనే మంటలు వ్యాపించి కటౌట్ దగ్ధమయింది.దీంతో వెంటనే అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పారు. అక్కడ ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని థియేటర్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి వివరించారు.

Advertisement

Next Story