- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికలకు సర్వం సిద్ధం..
దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో 7,32,438 మంది ఓటర్లు ఉండగా వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు 638 బూత్ లను సిద్ధం చేశామని అన్నారు. ఎన్నికల విధుల్లో మొత్తం 4600 మంది సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. ఇందులో 670 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2900 మంది ఏపీఓలు విధులు నిర్వహించనున్నారు. 1278 బ్యాలెట్ యూనిట్లు ఉండగా, పోలింగ్ కోసం 638 ఈవీఎంలు అందుబాటులో ఉండనున్నట్లు ఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, బయట వీడియో కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఎన్నికల సిబ్బందికి సామాగ్రి పంపిణీ
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి బుధవారం గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో అధికారులు సామాగ్రిని పంపిణీ చేశారు. ఈవీఎంలు, ఓటర్ లిస్ట్, ఇతర సామాగ్రిని అందించారు. అలాగే ఆయా ప్రాంతాలకు చేరుకునేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతిపోలింగ్ బూత్ ను వెబ్ కాస్టింగ్ ద్వారా గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఎన్నికల పరిశీలకులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు.