- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుంది: ఆర్ రోహిణి
దిశ ప్రతినిధి ,హైదరాబాద్: రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని హైదరాబాద్ జిల్లా డీఈఓ ఆర్ రోహిణి అన్నారు. టీఎన్జీవో పాఠశాల విద్యాశాఖ యూనిట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్ కుమార్, కార్యదర్శి భాస్కర్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం డీఈఓ కార్యాలయంలో బతుకమ్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె.. మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ అధికారికంగా నిర్వహిస్తోందన్నారు.
ఈ ఉత్సవాలలో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు . అంతకు ముందు కార్యాలయంలో మాతా త్రిపురా సుందరి దేవీకి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా కార్యదర్శి విక్రమ్ కుమార్, ఏడీ శ్రీనివాస్ రెడ్డి, ఎఫ్ఏఓ శ్రీనివాస్, మురళీ, వెంకటేశ్, శంకర్ ,గీత, జానకి, వీ డేవిడ్, ప్రేమ్ కుమార్, బీ రవి, రుగేష్,జయంతి తదితరులు పాల్గొన్నారు.