Hanuman Movie Issue: తప్పుడు రాతలు రాస్తే తాట తీస్తా అంటూ దిల్ రాజు వార్నింగ్

by srinivas |   ( Updated:2024-01-08 13:22:15.0  )
Hanuman Movie Issue: తప్పుడు రాతలు రాస్తే తాట తీస్తా అంటూ దిల్ రాజు వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ‘హనుమాన్’ సినిమా రిలీజ్‌‌ను నిలిపివేయాలని నిర్మాతను, డైరెక్టర్‌ను ఒత్తిడి చేసినట్లు తనపై జరుగుతున్న ప్రచారంపై ప్రొడ్యూసర్ దిల్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘హనుమాన్’ మూవీని తాను నిలివేయాలని చెప్పినట్లు ఎవరిదగ్గరైనా ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా తప్పుడు రాతలు రాస్తే తాట తీస్తానని దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయని, అందులో ‘హనుమాన్’ సినిమా కూడా విడుదల అవుతోందని చెప్పారు. థియేటర్లు దొరకపోవడం వల్ల రవితేజ మూవీ డేట్ పోస్ట్ పోన్డ్ అయిందని దిల్ రాజు చెప్పారు.

అంతేకాదు ఈ సంక్రాంతికి ఓ తమిళ మూవీని తాను విడుదల చేస్తున్నట్లు వస్తున్న వార్తలపైనా దిల్ రాజు మండిపడ్డారు. ఎటువంటి తమిళ సినిమాను తాను విడుదల చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి సంక్రాంతికి కావాలనే తనపై వివాదాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైలెట్ అవ్వడం కోసం కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు వక్రీకరించి రాస్తున్నాయని మండిపడ్డారు. ఇక నుంచి ఎవర్నీ వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. కాంట్రవర్సీలపై ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క అని దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అనుమానాలున్నా తన వద్దకు వస్తే నివృత్తి చేస్తానని.. ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తలు రాయొద్దని దిల్ రాజు హెచ్చరించారు.

Advertisement

Next Story