- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Arekapudi Gandhi : రూ.9 వేల కోట్లతో అన్ని వర్గాల అభివృద్ధి
దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలతో నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్, ఆస్బెస్టాస్ కాలనీలలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి గాంధీ ఇంటింటి ప్రచారం చేశారు.
స్థానికులతో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటువేసి మరోసారి గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ల సహకారంతో రూ.9 వేల కోట్ల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష అని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని, ఈ విజయాన్ని కేసీఆర్ కు కానుకగా ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
పాస్టర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ బీఆర్ఎస్ అభ్యర్థి గాంధీకి ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించింది. శనివారం మియాపూర్ లో సమావేశం అయిన శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పాస్టర్స్ గాంధీతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సుమారు 500 మంది పాస్టర్స్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. క్రిస్టియన్స్ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని, ఎక్కడ సమస్య ఉన్నా తమకు మద్దతుగా నిలుస్తున్నారని, అందుకే గాంధీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.