పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో కీలక మలుపులు...

by Aamani |
పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో కీలక మలుపులు...
X

దిశ,ఖైరతాబాద్ : పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో తన కుమారుడిని తప్పించేందుకు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రయత్నించిన విషయంలో షకీల్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి మంగళవారం డీసీపీ విజయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో రాహిల్‌తో పాటు షకీల్ కూడా దుబాయ్‌కు పారిపోయినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఆరోపణల్లో పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌తో పాటు బోధన్ ఇన్‌స్పెక్టర్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుడికి పోలీసులు సహకరించినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు.

ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. మంగళవారం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో మాజీ సీఐ దుర్గారావును హజరుపరచగ షరతులతో కూడిన బెయిల్‌ను జడ్జి మంజూరు చేశారు. పోలీసుల విచారణకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మార్చ్, 2022లో యాక్సిడెంట్ జరిగిందని.. ఈ యాక్సిడెంట్‌లో ఒక బాబు చనిపోయినట్లు తెలిపారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహీల్‌ను తప్పించారనే వార్తలు వచ్చాయన్నారు. ఆ కేసును కూడా తిరిగి విచారణ చేస్తామన్నారు. ఆ కేసుకు సంబంధించి కోర్టులో ట్రయల్ జరుగుతోందని డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.

Advertisement

Next Story