- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసేందుకు కుట్ర: ఆర్.కృష్ణయ్య
దిశ,హిమాయత్ నగర్ : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసేందుకు కుట్ర చేస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ లో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఫీజుల పోరు సభకు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టేందుకు విద్యార్థుల మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్ని అప్పులు తీసుకువచ్చి ఎంత ఖర్చు పెట్టారో దానిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోర్సులు పూర్తయినప్పటికీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజు బకాయిలు 4000 కోట్లు విడుదల చేయాలని ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలన్నారు. లేనిపక్షంలో మంత్రులను, ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరుగనీయమని హెచ్చరించారు. హాస్టల్ లో 1200 మంది విద్యార్థులు కల్తీ భోజనం వల్ల అస్వస్థతకు గురయ్యారని అందులో 40 మంది విద్యార్థులు మృతి చెందినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. బకాయిలు చెల్లించక పోతే స్కూల్స్, కళాశాలలను బంద్ చేస్తామని హెచ్చరించారు ఫీజు రీయింబర్స్మెంట్ జోలికి వస్తే ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నీలా వెంకటేష్, గుజ్జ సత్యం, నంద గోపాల్, గొరిగే మల్లేష్, సతీష్, బాలయ్య, రాందేవ్ మోడీ తదితరులు పాల్గొన్నారు.