గ్రేటర్‌పై హై కమాండ్ నజర్.. 16న కీలక మీటింగ్

by srinivas |
గ్రేటర్‌పై హై కమాండ్ నజర్.. 16న కీలక మీటింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల16న గ్రేటర్ కాంగ్రెస్ నేతలతో హై కమాండ్ కీలక మీటింగ్ నిర్వహించనున్నదని హైదరాబాద్ ఇన్‌చార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఈ మీటింగ్‌ను నిర్వహిస్తామని ఆయన శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏఐసీసీ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్ లు ఈ మీటింగ్‌కు హాజరు కానున్నారని వెల్లడించారు.


జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యాచరణ, హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పటిష్టత ,పార్టీ సంస్థాగ్రత అభివృద్ధి తీసుకోవల్సిన చర్యలు, ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం, పార్టీ కోసం కష్టపడిన వారికే పార్టీ, ప్రభుత్వ పదవులు ,డివిజన్‌లో వారీగా పార్టీల కమిటీలు తదితర ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తామని మంత్రి వెల్లడించారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలోని రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన 15 నియోజకవర్గాల అభ్యర్థులు, ఎమ్మెల్సీలు, పార్టీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ జనరల్ సెక్రటరీలు ,మాజీ పీసీసీ అధ్యక్షులు కార్పోరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న కార్పొరేటర్‌గా పోటీ చేసిన అభ్యర్థులు, ఈ సమావేశంలో పాల్గొననున్నారని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed