- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ వైపు ‘సిటీ’ BRS ఎమ్మెల్యేల చూపు.. త్వరలోనే చేరేందుకు ఓ నేత ప్లాన్..?
దిశ, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఇంట ఓడి రచ్చ గెలిచినట్టుంది. పరిపాలనకు కేంద్రబింధువైన రాజధాని హైదరాబాద్‌లో ఒక్క స్థానం కూడా దక్కకపోవటం కొందరు కాంగ్రెస్ సీనియర్లు జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. రాజకీయాల్లో గెలుపు ఓటమిలు మామూలే అయినా, ఒక్కసారి పవర్‌కు అలవాటుపడిన ప్రజాప్రతినిధులు అది లేకుండా ఉండలేకపోతున్నారంటూ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పవర్ ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారినప్పుడు రాజకీయ వలసలు కూడా జరగటం మామూలే. కానీ పదేళ్లపాటు పవర్ అనుభవించిన బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు కావటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పలువురు ప్రజాప్రతినిధుల పరిస్థితి విచిత్రంగా మారింది.
హైదరాబాద్ లీడర్లు ఎప్పటికప్పుడు తమ అవసరాలు, ప్రయోజనాల కోసం ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి మారుతుంటారు. కానీ పవర్ లేకుండా పట్టుమని పదిరోజులు కూడా రాజకీయాల్లో ఉండలేని ప్రజాప్రతినిధులే సిటీలో ఎక్కువ మంది ఉన్నారని చెప్పవచ్చు. కౌంటింగ్ ముగిసిన రెండు రోజులు కూడా గడవకముందే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పవర్ ఫీవర్ పట్టుకుంది. కాంగ్రెస్‌లో చేరితే ఏమైనా మంత్రి పదవీ ఇస్తారేమోనంటూ కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బడా నేతలకు టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
సిటీలో బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై రెండోసారి గెలిచిన కొందరు బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. కానీ కాంగ్రెస్ నేతలు ఆహ్వానిస్తేనే వెళితే తమకు విలువ ఉంటుందని భావిస్తుండగా, సర్కారును ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలుండటంతో కాంగ్రెస్ నేతలెందుకు ఆహ్వానిస్తారు? మనమే డిమాండ్ పంపితే బాగుంటుందని కొందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని ఓ మాజీ మంత్రి కాంగ్రెస్ బడా నేతలకు టచ్‌లోకి వెళ్లినట్లు చర్చ జరుగుతుంది.
రాజధానిలో కాంగ్రెస్ ఉనికి నిల్..
హైదరాబాద్ నగరంలో మొత్తం15 అసెంబ్లీ సీట్లుండగా, రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ సీట్లను గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. మొత్తం సీట్లలో ఏడు బీఆర్ఎస్ గెలుచుకోగా, మరో ఏడు మజ్లీస్ పార్టీ కైవసం చేసుకోగా, ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే. ఇటు రాజధాని నగరంలోని ఒక్క సీటు లేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూనే, బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి కనీసం రెండు స్థానాల ఎమ్మెల్యేలుంటే బాగుండునన్న అభిప్రాయం కొందరు కాంగ్రెస్ నేతలు చర్చించుకున్నట్లు సమాచారం.
ఇప్పుడు కాకపోయినా, సర్కారు ఏర్పాటు చేసి, ఏప్రిల్‌లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు ముందైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహారచన చేసే అవకాశమున్నట్లు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సిటీకి చెంది, గతంలో కాంగ్రెస్‌లో కొనసాగిన ఓ ఎమ్మెల్యే తనకు మంత్రి పదవీ ఇస్తే కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్దమేనని తన పొలిటికల్ సర్కిల్లోని కొందరితో వ్యాఖ్యానించినట్లు సమాచారం.