- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మీసేవలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్

దిశ, హైదరాబాద్ బ్యూరో: మీసేవ కేంద్రాల ద్వారా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ మేరకు శనివారం ఉదయం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుమారు పదేళ్లుగా రాష్ట్ర్ల్రంలో నూతన రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, మార్పులు, చేర్సులు చేస్తామని, ఇందుకు నేటి నుండి మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం ఐటీ2/2196/2025 తేదీ 07.02.2025 ద్వారా ప్రకటించింది. దీంతో కొత్త రేషన్ కార్డులు కావాల్సిన వారు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధపడుతున్న తరుణంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు కొత్త రేషన్ కార్డులు మీసేవ ద్వారా తీసుకోవడం లేదంతూ కింది స్థాయి సిబ్బంది సమాచారం అందడంతో అప్లికేషన్ల స్వీకరణ పక్రియ నిలిచిపోయింది. ప్రజాపాలన, ప్రజావాణి అప్లికేషన్‌ల డేటా ఎంట్రీపై వివరణాత్మక సూచనలు త్వరలో జారీ చేస్తామని, అందరూ డీసీఎస్‌వోలు ఈ ఆదేశాలను కింది స్థాయి సిబ్బందికి తెలపాలని వారికి వాట్సాప్ మెసేజ్‌లు అందాయి. అయితే, ఇది తెలియని వారు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లి సైట్ ఓపెన్ కాకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.