లంగర్ హౌస్ ఫ్లైఓవర్ కు బాంబు బెదిరింపు కాల్...వ్యక్తి అరెస్ట్

by Kalyani |
లంగర్ హౌస్ ఫ్లైఓవర్ కు బాంబు బెదిరింపు కాల్...వ్యక్తి అరెస్ట్
X

దిశ,కార్వాన్ : లంగర్ హౌస్ ఫ్లైఓవర్ కు బాంబు పెట్టారని డయల్ 100 కు ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని లంగర్ హౌస్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఎస్సై రాజు కథనం ప్రకారం... లంగర్ హౌస్ బద్దాదు కాలనీకి చెందిన అబ్దుల్ ఇమ్రాన్ (33) ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవిస్తున్నాడు. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భార్యతో గొడవపడి తాగిన మైకంలో 100కు కాల్ చేసి, లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పై బాంబు ఉందని ఫేక్ కాల్ చేశాడు. దీంతో వెంటనే ఉరుకులు, పరుగులు చేపట్టిన పోలీసులు అన్ని చోట్ల బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. చివరికి బాంబు లేదని నిర్ధారించుకొని, ఫేక్ కాల్ చేసిన అతనిపై లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఫేక్ కాల్ చేసిన నిందితున్ని గురువారం అదుపులోకి తీసుకొని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి రిమాండ్ కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed