Mohan Babu : మోహన్‌బాబుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

by M.Rajitha |   ( Updated:2024-12-11 15:51:49.0  )
Mohan Babu : మోహన్‌బాబుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
X

దిశ, వెబ్ డెస్క్ : రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే విధించాలని సినీనటుడు మోహన్‌బాబు(Mohan Babu) హైకోర్టు(High Court)ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్ట్ పోలీసుల ముందు హాజరయ్యేందుకు మినహాయింపు ఇచ్చింది. ఈ గొడవ ఆయన కుటుంబ వ్యవహారం కావడంతో పోలీసులు ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆయన ఇంటిని పర్యవేక్షించాలని సూచించింది. తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా వేసింది. కాగా నోటీసులు అందుకున్న మనోజ్ విచారణకు హాజరయ్యారని, మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మీద కాకుండా నిన్న రాత్రి మోహన్‌బాబు నిన్నరాత్రి జర్నలిస్టుల మీద చేసిన దాడిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారని.. ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ అయ్యాయని జీపీ కోర్టుకు వివరించారు.

Read More...

మోహన్‌బాబు ప్రవర్తన దిగజారినట్టు అనిపించింది: పల్లా శ్రీనివాసరావు


Advertisement

Next Story