- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యాంగం ద్వారా రావాల్సిన హక్కుల కోసం బీసీలందరూ ఏకంగా పోరాడాలి : ఈటల
దిశ, ఎల్బీనగర్ : తెలంగాణ రాష్ట్ర వీరభద్రియ (వీరముష్టి) కుల సంఘం ఏర్పడి నేటికీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా బుధవారం మనసురాబాద్ డివిజన్ పరిధిలోని ఎస్ కే ఎస్ ఫంక్షన్ హాల్ నందు రాష్ట్రీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడినటువంటి సబ్బండ కులాలు ఏకమై రాజ్యాంగం ద్వారా తమకు రావలసిన హక్కులను సాధించుకోవాలని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చెవ్వ కొండయ్య, కోశాధికారి కాటేపల్లి రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.