- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓపెన్ నాలాలో బైక్‌తో సహా పడిపోయిన యువకుడు..
దిశ, చార్మినార్: జీహెచ్ఎంసీ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి పాతబస్తీకి చెందిన ఓ యువకుడు బైక్‌తో సహా ఓపెన్ నాలాలో పడిపోయిన ఘటన శాలిబండా పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీ శాలిబండాలో కొన్ని నెలల క్రితం ఓపెన్ నాలా నిర్మాణ పనులు చేపడుతున్నారు. 8 ఫీట్ల లోతులో తొవ్వి వదిలేశారు. అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఎలాంటి సూచిక బోర్డును ఏర్పాటు చేయలేదు. దీంతో బుధవారం అర్థరాత్రి శాలిబండా వైపుగా వస్తున్న యువకుడు బైక్‌తో సహా ఓపెన్ నాలాలో పడిపోయాడు.
ఆ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని తాళ్లతో బైక్ తో పాటు యువకుడిని పైకి లాగారు. గాయాలపాలైన యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యానికి కారణమైన కాంట్రాక్టర్‌తో పాటు సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.