- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నువ్వు నాన్ లోకల్.. నేను లోకల్... రేపు తేల్చుకుందాం..!
దిశ, శేరిలింగంపల్లి: ఎమ్మెల్యే అరికెపూడిలా తాను పార్టీ మారలేదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ బీఫామ్‌పై గెలిచి బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నానని ఆయన తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల వరకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరవేస్తానని సవాల్ విసిరిన కౌశిక్ రెడ్డి కొండాపూర్‌లోని తన ఇంటి వద్దనే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గాంధీని ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాను ప్రతిపక్ష నాయకుడినే అని చెబుతున్న గాంధీది, తనది ఒకే పార్టీ కాబట్టి ఆయన ఇంటికి వెళ్లి జెండా కప్పి బీఆర్‌ఎస్ భవన్‌కు తీసుకువెళ్తానని తాను చెప్పానని, కానీ కొట్టుకునేందుకు, తన్నుకునేందుకు కాదని కౌశిక్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో తన్నుకోవడమే పరిష్కారం అంటే గాంధీ ఒక్కడు వస్తే తాను సిద్ధమేనని చెప్పారు. అయినా గాంధీ 60 ఏళ్ల వృద్ధుడు అని, తాను 39 ఏళ్ల యువకుడినని చెప్పారు. తాను గాంధీ ఇంటికి బయలుదేరుతా అనగానే తన ఇంటి చుట్టూ కంచెలు వేశారని, పోలీసులను పంపి గృహ నిర్బంధం చేశారని మండిపడ్డారు. గాంధీ బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి బీఆర్‌ఎస్ భవన్‌కు వెళ్దామనడంలో తప్పేముందని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఆమాత్రం దానికి గాంధీ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని నిలదీశారు. గాంధీ పార్టీ మారనప్పుడు బీఆర్‌ఎస్ జెండా కప్పుకోవడానికి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరనపపుడు బీఆర్ఎస్ జెండా కప్పుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కౌశిక్ రెడ్డి బ్రోకర్ అన్న గాంధీ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబును, కేసీఆర్‌ను అందరిని మోసం చేసింది గాంధీ అని, ఆయనే అసలైన బ్రోకర్ అంటూ కౌంటర్ ఇచ్చారు. హుజురాబాద్‌లో ఈటెల రాజేందర్‌ను ఓడించి బీఆర్‌ఎస్ జెండా ఎగురవేసిన వ్యక్తినని, తమరు వాడేభాష శేరిలింగంపల్లి ప్రజలు చూస్తున్నారన్నారు. తాను తెలంగాణ గడ్డ మీద పుట్టిన వ్యక్తినని, గాంధీలా ఎక్కడి నుండో రాలేదన్నారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి నుంచి బయలుదేరి గాంధీ ఇంటికి వెళ్దామని, పార్టీ కార్యకర్తలందరూ రావాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీకి తనకు ఏమైనా భూమి పంచాయితీ ఉందా..? ఇద్దరం తన్నుకోడానికి అని వ్యాఖ్యానించారు. ‘‘మీ స్వార్ధం కోసం, భూ పంచాయితీల కోసం పార్టీ మారడం గాంధీకి పరిపాటి. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలి. చీరలు, గాజుల భాష రేవంత్ రెడ్డిని చూసే నేర్చుకున్నా.’’ అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.