- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
దిశ, హైదరాబాద్ బ్యూరో : దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గురువారం గ్రేటర్ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, కాలనీలు, అపార్ట్ మెంట్లు ,ఉద్యోగ సంఘాల కార్యాలయాలు తదితర ప్రాంతాలలో మువ్వన్నెల జాతీయ జెండాను ఎగుర వేసి జెండాకు వందన సమర్పణ చేశారు. మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. దీంతో నగర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జాతీయ జెండాను ఎగురవేసి జిల్లా సాధించిన పురోభివృద్ధిని వివరించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన పలువురు ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో...
ఐక్యత మన బలానికి మూల స్తంభమని ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్ అన్నారు. గురువారం ఆయన బ్యాంక్ స్ట్రీట్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన వీరులను గుర్తు చేసుకోవడం వారికి అర్పించే సముచితమైన నివాళి అని అన్నారు. వారి త్యాగాల వల్లనే మనం ఈరోజు స్వేచ్ఛా, ప్రజాస్వామ్య దేశంలో జీవించగలుగుతున్నామన్నారు. మన దేశం లెక్కలేనన్ని సంస్కృతులు, భాషలు , సంప్రదాయాలతో అల్లిన వస్త్రమన్నారు.
1947లో స్వాతంత్య్రం తర్వాత, భారతదేశం సామాజిక , ఆర్థిక, సాంకేతిక రంగాలలో విశేషమైన పురోగతిని సాధించిందన్నారు. దేశ ప్రగతి ప్రయాణంలో నిరంతరం భాగస్వామిగా ఉన్న ఎస్‌బీఐ కుటుంబంలో భాగమైనందుకు గర్విస్తున్నామన్నారు. తమ బ్యాంక్ గత ఆర్ధిక సంవత్సరంలో రూ 61,077 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిందని రాజేష్ కుమార్ తెలిపారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో కొత్తగా 75 కొత్త శాఖలు ఏర్పాటు చేయబడుతున్నామని , ఇందులో 15 అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఓ ఆర్ ఆర్ కు సమీపంలో ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఉద్యోగుల పిల్లలు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ సంప్రదాయ నృత్యాలు చేశారు. క్రీడలు, నృత్యం, విద్యతో పాటు పలు రంగాల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ రష్మీ సిన్హా, ప్రకాష్ చంద్ర బారోర్, రవి కుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
మహనీయులను స్మరించుకుందాం : ఉప్పల శ్రీనివాస్ గుప్తా...
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకుందామని టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. నారాయణగూడ లోని ఐవీఎఫ్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో
ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు హామీనిచ్చినట్లుగా ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్నారు. ఆర్య, వైశ్యులకు ఎన్నో ఏళ్లు కలగా ఉన్న ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పబ్బ చెంద్ర శేఖర్ గుప్తా, ముత్యాల సత్తయ్య , బిజ్జల నవీన్, భాగ్య లక్ష్మి, మంజుల, కట్ట రవి, శ్రీధర్, కిరణ్ పాల్గొన్నారు.
- Tags
- Independence Day