వైద్యుల అద్భుతం.. 105 ఏండ్ల వృద్దురాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స

by Satheesh |
వైద్యుల అద్భుతం.. 105 ఏండ్ల వృద్దురాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తుంటి ఎముక విరిగిన 105 ఏండ్ల వృద్ధురాలికి అమోర్ ఆస్పత్రి వైద్యులు విజ‌య‌వంతంగా శ‌స్త్రచికిత్స చేశారు. ఈ చికిత్సతో ఆమె మ‌ళ్లీ త‌న కాళ్లమీద నిల‌బ‌డడడమే కాకుండా నడువగలుగుతున్నారు. ఈ మేరకు శ‌స్త్రచికిత్స గురించి అమోర్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ విభాగాధిప‌తి, ఆర్థోపెడిక్ ఆంకాల‌జీ స‌ర్జన్ డాక్టర్ కిశోర్ బి రెడ్డి మంగళవారం వివరాలు వెల్లడించారు.

మూసాపేట ప్రాంతానికి చెందిన రాణీదేవికి తుంటి ఎముక విర‌గ‌డంతో అమోర్ ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఆమె వ‌య‌సు దృష్ట్యా శ‌స్త్రచికిత్స చేయ‌డం ఇబ్బందిక‌ర‌మ‌న్న ఉద్దేశంతో కొన్ని ఇత‌ర ఆస్పత్రులు ఆమెను చేర్చుకోలేదని చెప్పారు. అయితే అమోర్ ఆస్పత్రిలోని వైద్యుల బృందం రోగి కుటుంబ‌స‌భ్యుల‌తో విస్తృతంగా చ‌ర్చించి, ఆపై శ‌స్త్రచికిత్స చేయడంతో కోలుకుందని వివరించారు. డాక్టర్ స‌ర్దార్ నేతృత్వంలోని క్రిటిక‌ల్ కేర్ బృందం, డాక్టర్ న‌ర‌సాపురం ప‌వ‌న్ కుమార్ నేతృత్వంలోని ఎన‌స్థీషియా బృందం సహకారంతో విరిగిన తుంటి ఎముక‌ను అతికించ‌డానికి సంక్లిష్టమైన శ‌స్త్రచికిత్స చేశామన్నారు.

Advertisement

Next Story