- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
హెచ్ఎండీఏలో 4 పోస్టులకు 20 దరఖాస్తులు

దిశ, తెలంగాణ బ్యూరో : హెచ్ఎండీఏ రవాణ రంగ విభాగమైన హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ ఫోర్ట్ ఆథారిటీ(హెచ్-యూఎంటీఏ) కాంట్రాక్టు విధానంలో రెండేండ్ల పాటు పనిచేయడానికి ట్రాన్స్ పోర్ట్ ఇంజినీరింగ్ నిపుణులు కావాలని హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. నాలుగు పోస్టులకుగాను 20మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను హెచ్ఎండీఏ అధికారులు పరిశీలిస్తున్నారు. ఒక జాయింట్ డైరెక్టర్(ట్రాన్స్ పోర్టేషన్), ముగ్గురు ట్రాన్స్ పోర్టేషన్ ఇంజినీర్లు/ప్లానర్లను కాంట్రాక్టు విధానంలో రెండేండ్లపాటు పనిచేసేవిధంగా నియమించుకోవాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ దరఖాస్తులను పరిశీలించిన జాయింట్ డైరెక్టర్, ముగ్గురు ఇంజినీర్ల కోసం కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియను 15రోజుల్లో పూర్తిచేసే అవకాశముంది.