- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుమాయున్ నగర్ లో 14.5 కిలోల గంజాయి స్వాధీనం
దిశ,కార్వాన్ : పక్కా సమాచారంతో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం హుమాయున్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి గంజాయి అమ్ముతున్న ఆరుగురు నీ అరెస్ట్ చేసిన సంఘటన చోటుచేసుకుంది. టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ సిటీ అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అందే శ్రీనివాస్ ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన హజారీ దినేష్ సింగ్ అలియాస్ టింకు సింగ్ (35) కైట్ మేకర్. గలిమేర గణపతి జిల్లా ఒడిస్సా రాష్ట్రానికి చెందిన అజిత్ నాయక్ (26), జీసెస్ మాలి (22) వీరిద్దరూ వ్యవసాయ కూలీలు. వీరి వద్ద దినేష్ సింగ్ గంజాయిని సేకరించి, నగరంలోని వివిధ ప్రాంతాలలో గంజాయిని సరఫరా చేసేవాడు. దూల్పేట్ జీన్స్ చౌర ప్రాంతానికి చెందిన సుశీల్ సింగ్ (28) గణేష్ ఐడల్ మేకర్, దూల్పేట్ ప్రాంతానికి చెందిన ముకేశ్ సింగ్ (28) ప్రైవేట్ జాబ్, శివసింగ్ (28) ప్రైవేట్ జాబ్. వీరికి గత కొంతకాలంగా దినేష్ సింగ్ గంజాయిని సరఫరా చేసేవాడు.
ఈ క్రమంలో పెద్ద మొత్తంలో గంజాయి సరఫరా అవుతున్నట్లు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందానికి తెలిసింది. వెంటనే ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందంతో పాటు హుమాయున్ నగర్ పోలీసులు కలిసి దాడులు నిర్వహించి వారిని పట్టుకొని వీరి వద్ద 14.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా ఆరుగురు వద్ద ఆరు సెల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు మూడు లక్షల 90 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే దినేష్ సింగ్ పై నగరంలోని షాహి నాయథ్ గంజ్, టప్పాచ బుత్ర, మంగళహాట్, యాచారం, ఎక్సైజ్ దూల్పేట్ పోలీస్ స్టేషన్ లలో పలు కేసులు నమోదై జైలుకు వెళ్లి వచ్చాడు. పలు కేసుల్లో జైలుకు వెళ్లినా కూడా పరివర్తన మారలేదని పోలీసులు తెలిపారు.