- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: అలాంటి కాల్స్‌కు బలైపోకండి.. ప్రజలకు సీపీ సీవీ ఆనంద్ హెచ్చరిక
దిశ, వెబ్, డెస్క్: ప్రజలను మోసగించేందుకు సైబర్ కేటుగాళ్లు(Cyber Crooks) కొత్త పుంతలు తొక్కుతున్నారు. పోలీస్ అధికారుల ఫోటోల(Police Officers)ను డీపీలు(DPs)గా పెట్టుకొని ఫేక్ కాల్స్(Fake calls)తో కొత్త దందాకు తెర లేపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(Hyderabad Police Commissioner CV Anand) డీపీతో ఫేక్ కాల్స్ చేయడం మొదలు పెట్టారు.
ఇటీవల హైదరాబాద్ ప్రజలకు పాకిస్థాన్ నెంబర్ల(Pakistani Numbers)తో ఫేక్ వాట్సాప్ కాల్స్(Fake WhatsApp Calls) చేశారు. సీవీ ఆనంద్ పేరు చెప్పి భయపెట్టి, ప్రజలను మోసగించే ప్రయత్నం చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన సీవీ ఆనంద్ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. దయచేసి అలాంటి కాల్స్‌కు బలైపోవద్దని కోరారు. అలాగే డబ్బు అడగడం, మీ బ్యాంక్ ఖాతాల సమాచారాన్ని తెలుసుకోవడం లాంటి వాటి కోసం ఏ అధికారి కూడా కాల్ చేయరని తెలిపారు. అంతేగాక ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.