- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఈ రోజే ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం లాస్ట్.. మెట్రోలో కిక్కిరిసిన జనం
దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితి ఉత్సవాలు మహానగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారత్‌లోనే అతిపెద్ద మహాగణపతిని దర్శించుకునేందుకు నగర వాసులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు.అలాగే ఈ రోజు ఆదివారం కావడం, సోమవారం ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం లేదని పోలీసులు ప్రకటించడంతో ఒక్కసారిగా ఖైరతాబాద్ కు భక్తుల తాకిడి పెరిగిపోయింది. ఈ క్రమంలో నగరంలో అన్ని మార్గాల్లోని మెట్రో రైళ్లు ఖైరతాబాద్ వచ్చే భక్తులతో నిండిపోయాయి. ముఖ్యంగా అమీర్‌పేట మెట్రోలో అయితే ఇసుకెస్తే రాలనంత జనం ఉన్నారు. మహాగణపతి తో పాటు నగరంలో ప్రఖ్యాతి గాంచిన వినాయక మండపాలను సందర్శించేందుకు యువత ఆసక్తి చూపుతుండటంతో మెట్రోలు కిక్కిరిసి పోతున్నట్లు తెలుస్తుంది.
ఇందులో ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు అత్యధికంగా ఖైరతాబాద్ స్టేషన్ లోకి వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు తెల్లవారు జాము నుంచే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. మధ్యాహ్నం సమయానికి భక్తుల తాకిడి అధికం అవ్వడంతో ఖైరతాబాద్ వెళ్లే అన్ని మార్గాల్లో ఎక్కడ చూసిన జనంతో నిండిపోయాయి. ఇదిలా ఉంటే సోమవారం ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం క్లోజ్ చేసి.. క్రేన్ ఎక్కించే పనులు జరుగుతాయని.. సెప్టెంబర్ 17 మంగళవారం ఉదయం అన్ని రకాల పూజలు పూర్తి చేసుకుని.. 6.30 గంటలకు మహా గణపతి శోభాయాత్ర ప్రారంభం అవుతుందని.. మధ్యాహ్నం 1.30 వరకు నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని.. హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు.