- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జనాభా లెక్కలు లేకుండా ప్రగతి ఎలా సాధ్యం: ఎమ్మెల్సీ కవిత

దిశ, తెలంగాణ బ్యూరో: జనగణనను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని.. జనగణన ఇంకెప్పుడు చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. జనగణనపై ‘ఎక్స్’ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు. జనాభా లెక్కలు లేకుండా ప్రగతి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. జనాభా లెక్కల లేమితో వృద్ధికి ఆటంకం కలుగుతుందని.. జనాభా లెక్కలు లేకుండా దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుంది అని పేర్కొన్నారు. ప్రగతిశీల విధానాలకు జనాభా లెక్కలు తప్పనిసరి అని తెలిపారు. జనగణనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
కవితతో బీసీ సంఘాల భేటీ..
కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ శాఖ సర్వే నివేదిక అందించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీసీ సంఘాలు, తెలంగాణ జాగృతి నేతలు భేటీ అయ్యారు. తదుపరి వ్యూహంపై ఎమ్మెల్సీ కవితతో బీసీ సంఘాల నేతలు చర్చించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన సర్వే గణాంకాల ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లపై కవిత తో కలిసి అధ్యయనం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ ఎంత మేరకు పెరుగుతుంది అనే అంశంపై చర్చించారు.