- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వయనాడ్‌లో ప్రియాంక గాంధీ చరిత్ర సృష్టించారు: వీహెచ్
దిశ, వెబ్ డెస్క్: రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 13 రాష్ట్రాల్లోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు(V Hanumantha Rao ) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వయనాడ్ ప్రజలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని ఆదరించారు. దీంతో ఆమె వాయనాడ్ ఉప ఎన్నికల్లో(Wayanad by-elections) చరిత్ర సృష్టించారని చెప్పుకొచ్చారు. అలాగే మహారాష్ట్రలో డబ్బుల ప్రభావంతో బీజేపీ గెలిచిందని.. మహారాష్ట్ర గెలుపు అదానీ, అంబానీది అని వీహెచ్ విమర్శించారు.
ఇదిలా ఉంటే వాయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అందరూ ఊహించినట్లుగానే.. రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారు. అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ విజయం సాధించగా.. ఝార్ఖండ్ రాష్ట్రంలో మాత్రం ఇండియా కూటమి విజయం సాధించింది. అలాగే వివిధ రాష్ట్రాలలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, స్థానిక ప్రభుత్వ పార్టీలు ఆధిపత్యం కొనసాగించాయి.