Hi-tech City: హైటెక్ సొగసులతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్! డిజైన్ పోస్ట్ చేసిన కేంద్ర మంత్రి

by Ramesh N |
Hi-tech City: హైటెక్ సొగసులతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్! డిజైన్ పోస్ట్ చేసిన కేంద్ర మంత్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం (Central government) ఆధునీకరిస్తోన్న విషయం తెలిసిందే. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద (Hyderabad) నగరంలోని సికింద్రాబాద్ వంటి పెద్ద స్టేషన్లతో పాటుగా మరో ఆరు చిన్న స్టేషన్లను ఆధునీకరణ చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ స్టేషన్లలో అభివృద్ధి పనులకు గాను (South Central Railway) దక్షిణ మధ్య రైల్వే రూ.170.61 కోట్ల నిధులు సైతం మంజూరు చేసింది. చిన్న స్టేషన్లు అయిన బేగంపేట, మల్కాజిగిరి, ఉప్పుగూడ, మలక్‌పేట, యాకుత్‌పుర, హైటెక్‌సిటీ స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు.

ఈ క్రమంలోనే శనివారం కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) ఎక్స్ వేదికగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రతిపాదిత డిజైన్ పంచుకున్నారు. ‘తెలంగాణలోని (Hitech City Railway Station) హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ₹26.6 కోట్ల అంచనా వ్యయంతో రీడెవలప్ చేయబడుతోంది. ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన సౌకర్యాలు స్టేషన్‌ను ఆధునిక రవాణా కేంద్రంగా మార్చడానికి ఒక ముఖ్యమైన దశను ప్రతిబింబిస్తాయి.’ అంటూ రైల్వే స్టేషన్ ఫోటోలు పంచుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed