చేతనైతే సాయం చెయ్.. విమర్శలొద్దు: కిషన్ రెడ్డికి మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్

by Shiva |
చేతనైతే సాయం చెయ్.. విమర్శలొద్దు: కిషన్ రెడ్డికి మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: చేతనైతే రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయాలని లేకపోతే విమర్శలు వద్దంటూ కిషన్ రెడ్డి (Kishan Reddy)కి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ మఖ్యమంత్రి నేనా.. రేవంత్ అన్న కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ (Telangana) రాష్ట్రానికి సీఎం ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఎవరి పరిధిలో వారు సక్రమంగా పని చేస్తే గౌరవం ఇస్తామని అన్నారు. మతచిచ్చు పెట్టే బీజేపీ (BJP) తెలంగాణలో ఎన్నటికీ అధికారంలోకి రాదని అవన్నీ పగటి కలలేనని కామెంట్ చేశారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్‌ (Bandi Sanjay)లను కేంద్ర నిధులు విషయంలో సాయం కోరితే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోని ఓ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిన కేంద్రం వివక్ష చూపుతుంటే రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్లు మౌనంగా కూర్చున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ విశ్వ నగరంగా అభివృద్ధి చెందే విషయంలో కిషన్ రెడ్డికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, విదేశాలకు పారిపోయిన నిందితులను రాష్ట్రానికి రప్పేంచే బాధ్యత కేంద్రానికి లేదా అని అన్నారు. ఓ రాష్ట్రంపై వివక్ష చూపుతూ తమకు కావాల్సిన రాష్ట్రాలకు అధికంగా ప్రాజెక్టులు, నిధులు కేటాయించే బీజేపీ వారికే బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు తెలుసని మహేశ్ కుమార్ గౌడ్ ధవ్జమెత్తారు.

Next Story

Most Viewed