- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) నగర వ్యాప్తంగా అనూహ్యంగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్న వరకు ఎండ మండిపోగా.. సాయంత్రం ఉన్నపళంగా వాతావరణం చల్లబడింది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం(Heavy Rain) దంచికొట్టింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, గండిపేట, మణికొండ, నార్సింగి, కాటేదాన్, బాచుపల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, మోతీనగర్, అమీర్‌పేట, ట్యాంక్‌బండ్, నారాయణగూడ, కవాడిగూడ, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై పలుచోట్ల వర్షం నీరు నిలిచింది. పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ(GHMC) కోరింది.
Advertisement
Next Story