- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి బ్యాచ్ మేట్ల చేయూత
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: చనిపోయిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి అతని బ్యాచ్ మేట్లు అండగా నిలిచారు. తలా కొంత మొత్తం పోగేసి మరణించిన స్నేహితుని కుటుంబానికి 2 లక్షల 45 వేల 225 రూపాయల చెక్కును సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చేతుల మీదుగా అందించారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ పని చేస్తున్న అశోక్ వర్ధన్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా చనిపోయాడు. ఈ క్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (సైబరాబాద్, రాచకొండ, నిజామాబాద్) 2000వ సంవత్సరం బ్యాచ్ హెడ్ కానిస్టేబుళ్లు తమ వంతుగా డబ్బును విరాళాల రూపంలో జమ చేసి అశోక్ వర్ధన్ చంద్రకళకు అందించారు.
దాంతోపాటు మరణానంతరం వచ్చే బెనిఫిట్స్ ను వీలైనంత త్వరగా అశోక్ వర్ధన్ కుటుంబానికి అందేలా చూడాలని కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యులకు ఏ అవసరమైనా తామున్నామంటూ భరోసానిచ్చారు. కార్యక్రమంలో అశోక్ వర్ధన్ పిల్లలు సుజన్, సంజన, బ్యాచ్ మేట్స్ శ్రీనివాస్, సత్తయ్య, వెంకటేశ్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, కోశాధికారి మల్లేశం, రాష్ర్ట ఉపాధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.